ETV Bharat / crime

Road Accident: ప్యారిస్​ నుంచి వస్తూ.. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మిత్రులు మృతి - వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది

road accident: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. ఒంగోలుకు చెందిన చెందిన పరమేష్, పవన్, శ్రీనులు విదేశాల్లో హోటల్ వ్యాపారం చేసేందుకు ప్యారిస్ వెళ్లారు. పనిముగించుకొని తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. చెన్నైలో విమానం దిగి తెల్లవారు జామున కారులో ఇంటికి వస్తుండగా వెళుతున్న లారీని ఢీకొనడంతో.. ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు.

road accident
road accident
author img

By

Published : Oct 14, 2022, 10:29 AM IST

Updated : Oct 14, 2022, 11:29 AM IST

Three friends killed in road accident: ఆముగ్గురు విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకున్నారు. అందుకు సంబంధించి అవకాశాలపై పరిశోధన చేస్తున్నారు. హోటల్​ వ్యాపారం చేసి ఉన్నతస్థాయికి ఎదగాలని భావించారు. నిన్నటి వరకు విదేశాల్లో పర్యటించి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన వారు, కారులో స్వగ్రామానికి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో చోటుచేసుకుంది.

ఒంగోలుకు చెందిన పరమేష్, పవన్, శ్రీనులు ఇటీవల హోటల్ వ్యాపారం పెట్టేందుకు వివిధ దేశాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో పరిశీలించేందుకు ప్యారిస్ వెళ్లారు. పనిముగించుకొని నిన్న తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. చెన్నైలో విమానం దిగి అక్కడి నుంచి కారులో ఒంగోలుకు బయలుదేరారు. రాత్రి కావడంతోపాటుగా.. అలసిపోవడంతో టంగుటూరు మండలం వల్లూరు గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటామనేలోపే ఈ ప్రమాదం జరగడం అందరిని కలచి వేసింది.

ఇవీ చదవండి:

Last Updated : Oct 14, 2022, 11:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.