ETV Bharat / crime

Boy Suicide : సైకిల్ కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య - సైకిల్ కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య

Boy Suicide : సైకిల్ కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కమ్మర్​పల్లి మండలంలో చోటు చేసుకుంది. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Boy Suicide Not Bought Bicycle
సైకిల్ కొనివ్వలేదని బాలుడు ఆత్మహత్య
author img

By

Published : May 12, 2022, 1:20 PM IST

Updated : May 12, 2022, 3:10 PM IST

Boy Suicide : నిజామాబాద్ జిల్లా కమ్మర్​పల్లి మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 13 సంవత్సరాల బాలుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక మండల కేంద్రానికి చెందిన టేకు విజయ్ 7వ తరగతి పూర్తి చేశాడు. తన తండ్రిని కొన్ని రోజులుగా సైకిల్ కొనివ్వమని వేధిస్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో ఆర్ధిక పరిస్థితి బాగాలేదని అన్నాడు. కొంచెం డబ్బు చేతికి వచ్చాక కొనిస్తానని తండ్రి చెప్పగా మనస్తాపానికి గురయ్యాడు.

దాంతో రెండు రోజుల క్రితం విజయ్ ఆడుకుంటానని బయటకి వెళ్లాడు. ఎంత చూసినా తిరిగి రాలేదు. ఇంతలో బుధవారం చెట్టుకు ఉరి వేసుకొని శవమై కనిపించాడు. అప్పటివరకు అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు ఒక్కసారిగా విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుని తండ్రి సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : May 12, 2022, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.