Student Died In America: ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు అమెరికాలో ప్రాణాలు కోల్పోయాడు. ఒంగోలు మండలం కొప్పోలుకు చెందిన కార్తీక్ ఉన్నత చదువుల కోసం నాలుగు నెలల కిందట షికాగో వెళ్ళాడు. నిన్న రాత్రి ఫిట్స్ రావడం వల్ల ఆసుపత్రికి తీసుకెళ్ళేలోపే మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. కార్తీక్ మరణవార్త వినగానే తల్లి శోభారాణి, బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. కార్తీక్ చిన్నతనంలోనే తండ్రి కాలం చేశారు. కార్తీక్ తమ్ముడు అనారోగ్యంతో చనిపోయారని బంధువులు వెల్లడించారు. కార్తీక్ మృతదేహాన్ని తరలించేందుకు తానా కృషి చేస్తోంది.
ఇదీ చదవండి: Power Cut Problems: "పవర్‌హాలిడే"తో పరిశ్రమలు కుదేలు.. ఆదుకోవాలని వినతి!