కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం నందవరంలో విషాదం జరిగింది. నందవరంలో తల్లీ, కుమారుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఎస్‌ఆర్‌బీసీ కాల్వలో మృతదేహాలు లభ్యమయ్యాయి. సరస్వతి, మధు శేఖర్‌గా గుర్తించారు. ఆస్తి కోసం బంధువులే హత్య చేశారని సరస్వతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
పొలానికి వెళ్లి..
పొలం పనికి వెళ్లిన తల్లీ కుమారుడి మృత దేహాలను అవుకు మండలం లింగంబోడు సమీపంలోని ఎస్‌ఆర్‌బీసీ కాలువలో పోలీసులు గుర్తించారు. భర్త మద్దిలేటి లారీ డ్రైవర్‌గా పని చేస్తుండగా, మరో చిన్న కుమారుడు మనీ వెంకట్ ఇంటి వద్దనే ఉన్నాడు. తల్లీ కుమారుడు మృతి చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు.
ఇవీ చూడండి : కొవిడ్‌పై సాగాలి సమష్టి పోరు