శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం డోలపేట పరిధిలోని మారుతినగర్లోని ఓ ఇంట్లో వ్యక్తి ఉరి వేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈయన యూనియన్ బ్యాంక్లో ప్రైవేటు ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతని పర్సలో ఓ అమ్మాయి ఫొటో ఉండడంతో ప్రేమ వైఫల్యమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. సంతకవిటి ఎస్ఐ సీహెచ్. రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: రేపు తొలిదశ ఎన్నికల పోలింగ్..విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు