Lovers Death in Banjara Hills: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ ప్రేమ జంట అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భవనం పైనుంచి కిందపడి ఇరువురు ప్రాణాలు కోల్పోయారు. సినీ ఫీల్డ్‌లో పని చేస్తున్న ఈ జంట.. కృష్ణానగర్‌లో ఉంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు.. తెలిసిన వారే భవనం పైనుంచి తోసేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చదవండి: