ఓటుకు నోటు కేసులో మొదటి సాక్షిగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని అనిశా ప్రత్యేక న్యాయస్థానం నమోదు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థికి ఓటేయాలంటూ తనకు లంచం ఆశ చూపారని స్టీఫెన్సన్ ఇచ్చిన ఫిర్యాదుతో అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు చేసి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేసింది. సాక్షుల విచారణ ప్రక్రియలో భాగంగా ఇవాళ స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసింది.
రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని కోర్టుకు తెలిపారు. నేటి విచారణకు మినహాయింపు కోరుతూ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహ, సెబాస్టియన్ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు అనుమతించింది. స్టీఫెన్సన్ వాంగ్మూలం నమోదు కొనసాగింపు ప్రక్రియ కోసం తదుపరి విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: