ETV Bharat / crime

తెలంగాణ: న్యాయవాదుల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్ట్

తెలంగాణలో న్యాయవాద దంపతుల హత్య కేసులో నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును అరెస్టు చేసినట్లు ఉత్తర మండల ఐజీ నాగిరెడ్డి తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీను ఇచ్చిన సమాచారం మేరకు పెద్దపల్లి జడ్పీ ఛైర్‌పర్సన్ మేనల్లుడు పుట్ట లింగమ్మ ఛారిటబుల్ ట్రస్ట్‌ ఛైర్మన్‌ బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు.

high court lawyers' murder case
న్యాయవాదుల హత్య కేసులో బిట్టు శ్రీను అరెస్ట్
author img

By

Published : Feb 22, 2021, 8:59 PM IST

తెలంగాణలో సంచలనం రేకెత్తించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో నాలుగో నిందితుడు బిట్టు శ్రీనును అరెస్టు చేసినట్లు ఉత్తర మండల ఐజీ నాగిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. కేసులో ప్రధాన నిందితుడు కుంట శ్రీను ఇచ్చిన సమాచారం మేరకు పెద్దపల్లి జడ్పీ ఛైర్‌పర్సన్ మేనల్లుడు పుట్ట లింగమ్మ ఛారిటబుల్ ట్రస్ట్‌ ఛైర్మన్‌ బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారించినట్లు తెలిపారు.

ప్రాణ స్నేహితులు...

కుంట శ్రీను, బిట్టు శ్రీను ఇద్దరు ప్రాణ స్నేహితులని ఐజీ పేర్కొన్నారు. కుంట శ్రీను ఆర్థిక మూలాలు దెబ్బతీసేందుకు వామన్​రావు కోర్టులో అనేక కేసులు వేసినట్లు చెప్పాడని ఆయన తెలిపారు. పుట్ట లింగమ్మ ట్రస్టుకు సంబంధించిన వ్యవహారాల్లోనూ తలదూర్చడమే కాకుండా సేవా కార్యక్రమాలు చేపట్టే ట్రస్టుపై ఆరోపణలు చేసేవాడని సామాజిక మాధ్యమాల్లో అవమానపరిచే విధంగా పోస్టులు పెట్టినట్లు ఆయన చెప్పారు. వామన్​రావు చర్యల గురించి బిట్టు శ్రీను, కుంట శ్రీనివాస్ పలు సందర్బాల్లో చర్చించుకున్నారని అతన్ని చంపకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పుకున్నట్లు ఐజీ పేర్కొన్నారు.

పట్టీలతో కత్తులు...

ఈ క్రమంలోనే కుంట శ్రీను రెండు కత్తులు తయారు చేయాలని బిట్లు శ్రీనుకు సూచించడంతో రెండు ట్రాక్టర్ పట్టీలతో కత్తులు సిద్ధం చేసి చిరంజీవి ఇంట్లో భద్రపరిచినట్లు పేర్కొన్నారు. వామన్​రావు దంపతులను హత్య చేసిన తర్వాత చిరంజీవి నేరుగా బిట్టు శ్రీనుకు సమాచారం ఇవ్వగా మహారాష్ట్ర పారిపోవాలని సలహా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒక మోటార్ సైకిల్‌తో పాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు ఇంకా లోతుగా విచారిస్తున్నట్లు ఐజీ నాగిరెడ్డి ఆ ప్రకటనలో వివరించారు.

ఇదీ చూడండి:

'వామనరావు హత్య కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.