ETV Bharat / crime

Son murdered father: రూ.200 ఇవ్వలేదని తండ్రినే చంపేశాడు - నేర వార్తలు

పున్నామ నరకం నుంచి కాపాడాల్సిన తనయుడే తండ్రి పాలిట యముడయ్యాడు. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతండ్రినే అంతమొందించాడు. తండ్రిపై ఆగ్రహంతో రోకలిబండతో దాడి చేయడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటన.. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగింది.

Son murdered father for money
రూ.200 ఇవ్వలేదని తండ్రినే చంపేసిన యువకుడు
author img

By

Published : Jul 21, 2021, 5:40 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో రోకలిబండతో బాది తండ్రినే హత్య చేశాడు ఆ తనయుడు. జిల్లాకేంద్రంలోని హనుమాన్​ బస్తీలో ఈ ఘటన జరిగింది.

సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న గోశిక కొమురయ్య(61) ఇటీవలే మెడికల్‌ పరీక్షలో అన్‌ఫిట్‌ అయ్యాడు. అతని ఉద్యోగం కుమారుడికి ఇవ్వకుండా యాజమాన్యం అందించిన పరిహారం తీసుకున్నాడు. ఈ విషయంలో మనస్తాపానికి గురైన కొమురయ్య కుమారుడు శివకుమార్‌... తండ్రిపై కోపం పెంచుకున్నాడు.

రెండొందల కోసం..

మంగళవారం రాత్రి.. మద్యం సేవించడానికి 200 రూపాయలు ఇవ్వాలని తండ్రిని అడిగాడు. డబ్బులు లేవని కొమురయ్య చెప్పడంతో ఆగ్రహంతో శివకుమార్​ తండ్రిపై రోకలిబండతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న 3 వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. పరారీలో ఉన్న శివకుమార్‌ కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:

AP RAINS: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.