Son Killed His Father: మద్యానికి బానిసైన కుమారుడు ఇంట్లో నిద్రిస్తున్న కన్నతండ్రిని కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేశాడు. మద్యం మాని ప్రవర్తన మార్చుకోమని చెప్పినందుకు కన్నతండ్రినే కడతేర్చాడు. అదేకాకుండా గొడ్డలి పట్టుకుని గ్రామంలో వీరంగం సృష్టించాడు. ఈ దారుణమైన ఘటన కర్నూలు జిల్లా కోసిగిలో జరిగింది.
కోసిగిలో నర్సింహులు అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం మత్తులో తల్లిదండ్రులను వేధించేవాడు. సహించలేని తండ్రి కొవ్వు ఈరయ్య పలుమార్లు మందలించాడు. తండ్రిపై విసుగు చెందిన నర్సింహులు.. ఎలాగైనా తండ్రిని హతమార్చాలని పథకం పన్నాడు. అర్ధరాత్రి వేళ తండ్రి నిద్రిస్తున్న సమయంలో.. నర్సింహులు గొంతుపై అతి కిరాతకంగా నరికాడు. తీవ్రంగా గాయపడిన ఈరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి ఈరయ్య భార్య ఆందోళనకు గురయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రక్తపు మరకలతో ఉన్న గొడ్డలి పట్టుకొని గ్రామంలో తిరుగుతూ.. స్థానికులను భయభ్రాంతులకు గురి చేశాడని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నర్సింహులును అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: