ETV Bharat / crime

ల్యాప్‌ట్యాప్‌ పేలి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం - ల్యాప్‌ట్యాప్‌ పేలి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిణికి తీవ్రగాయాలు

Laptop Blast
ల్యాప్‌ట్యాప్‌ పేలి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిణికి తీవ్రగాయాలు
author img

By

Published : Apr 18, 2022, 1:25 PM IST

Updated : Apr 18, 2022, 2:07 PM IST

13:22 April 18

కడపలోని ఆస్పత్రికి తరలింపు

Laptop Blast: కడప జిల్లా బి.కోడూరు మండలం మేకవారిపల్లి గ్రామంలో ప్రమాదం జరిగింది. వర్క్ ఫ్రం హోమ్​లో భాగంగా గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సుమతి.. ఇంటి దగ్గరే విధులు నిర్వహిస్తోంది. విధుల్లో భాగంగా ఈ రోజు ఉదయం లాప్​టాప్​​కు ఛార్జింగ్​ పెట్టి ఒడిలో పెట్టుకుని పని చేస్తుండగా ఒక్కసారిగా పేలింది. గది లోపల లాక్​ పెట్టుకుని విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు ఆమెను కాపాడడంలో ఆలస్యమైంది. గదిలోనుంచి మంటలు రావడంతో గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను బయటకు తీసుకొచ్చి చికిత్స నిమిత్తం కడపలోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పరీక్షించిన వైద్యులు ఆమెను కడప రిమ్స్​కి తీసుకెళ్లాలని సూచించారు.

ఇదీ చదవండి: మూడేళ్లలో ముందుకు సాగని సాగునీటి ప్రాజెక్టులు... ఎప్పటికప్పుడు గడువు పెంపు!

Last Updated : Apr 18, 2022, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.