ETV Bharat / crime

liquor in Patrolling vehicle: పోలీస్​ వాహనంలో మద్యం.. ఎస్సైపై వేటు

author img

By

Published : Nov 21, 2021, 11:16 PM IST

ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తూ పట్టుబడిన కానిస్టేబుల్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి ఠాణాలో కానిస్టేబుల్​గా పనిచేస్తున్న శ్రావణ్​ కుమార్​ ఏపీకి అక్రమంగా మద్యం(liquor in Patrolling vehicle) తరలిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ ఎస్సై విజయ్​ కుమార్​ను సస్పెండ్​ చేశారు (constable smuggling).

constable liquor smuggling case
constable liquor smuggling case

తెలంగాణ మద్యం ఆంధ్రాకు గుట్టుచప్పుడు కాకుండా వెళ్తోంది. ఆంధ్రప్రదేశ్​లో దశలవారీగా మద్యపానం నిషేధం అమలులో ఉండటంతో... మద్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. ఇదే అదనుగా తెలంగాణ మద్యాన్ని కొంత మంది అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గత ఆదివారం నల్గొండ జిల్లా, దామరచర్ల మండలం వాడపల్లి పోలీస్ స్టేషన్​(vadapally ps)లో విధులు నిర్వహిస్తున్న శ్రవణ్‌కుమార్‌ అనే కానిస్టేబుల్‌... పోలీస్​ పెట్రోలింగ్‌ వాహనంలో మద్యం కాటన్లను (constable liquor smuggling)తరలిస్తుండగా గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు(dachepally police) రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఎస్సై విజయ్​ కుమార్​ను(si suspension) సస్పెండ్​ చేశారు .

శ్రవణ్​ కుమార్​ అనే కానిస్టేబుల్​ ఆదివారం రాత్రి డయల్​ 100 విధుల్లో ఉండగా.. అర్ధరాత్రి 2 గంటల సమయంలో తోటి కానిస్టేబుల్​తో అత్యవసర పని ఉందని చెప్పి అతడిని పోలీస్​ స్టేషన్​లో దింపి వెళ్లి.. మరలా తెల్లవారు జాము 3గంటల సమయంలో తిరిగొచ్చి విధులకు హాజరుకాలేదు. ఉదయాన్నే తనిఖీ చేయగా అతడు విధులకు హాజరు కాలేనట్లు తెలిసింది. దాచేపల్లి ఠాణా పరిధిలో లిక్కర్​తో దొరికినట్లుగా తెలిసింది. అతడిని అరెస్టు చేసి రిమాండ్​కు పంపించడం జరిగింది. సుమారు 85 వేల విలువైన మద్యంతో దొరికినట్లుగా తెలిసింది. - సత్యనారాయణ, రూరల్​ సీఐ

ఏం జరిగింది?..

constable liquor smuggling case
ఎస్సైని సస్పెండ్​ చేస్తూ ఆర్డర్స్​

వాడపల్లి పీఎస్‌ పెట్రోలింగ్‌ వాహనం ఈ నెల 14న రాత్రి నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి(narketpally highway)పై తిరుగుతోంది. విధుల్లో ఉన్న శ్రవణ్‌కుమార్‌కు అర్ధరాత్రి దాటిన తర్వాత ఫోన్‌ వచ్చింది. మద్యం సీసా కాటన్లు గల వాహనం అతని వద్దకు రాగా అందులో ఉన్న సరుకును వాడపల్లి సమీపంలో పెట్రోలింగ్‌ వాహనంలోకి పేర్చారు. పోలీసు వాహనం కావడంతో చెక్‌పోస్టు వద్ద అధికారులు తనిఖీ చేయలేదు. సరిహద్దు దాటి రామాపురం క్రాస్‌రోడ్‌ వద్ద మద్యం కాటన్లను వేరే వాహనంలో వేసి వస్తుండగా గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు స్వయంగా పట్టుకున్నారు. పెట్రోలింగ్‌ వాహనంతో పాటు, సదరు కానిస్టేబుల్‌ వెంట ఉన్న మద్యం నిల్వలను దాచేపల్లి పీఎస్‌కు తరలించారు.

పోలీసు వాహనమైతే ఎవరూ ఆపరని..

తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఏపీకి మద్యం చేరాలంటే సరిహద్దులో ఏపీ ఎక్సైజ్‌శాఖ చెక్‌పోస్టు(ap excise check post)ను దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సరిహద్దున ఉన్న పొందుగుల చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ ఉండడంతో క్షేమంగా సరకు వెళ్లేందుకు ఏపీకి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ముఠా పోలీసుల వాహనాలను ఎంచుకున్నారు. ఇందుకు వాడపల్లి పీఎస్‌లో ఉన్న పెట్రోలింగ్‌ వాహనం అనువుగా ఉంటుందని భావించి ఆ మేరకు మాట్లాడుకున్నారు. అప్పటి నుంచి రాత్రి వేళ విధుల్లో ఉన్న వారు ఈ వాహనం ద్వారా సరుకును సరిహద్దును దాటిస్తున్నారు. కొంతకాలంగా వాడపల్లి పీఎస్‌కు చెందిన పెట్రోలింగ్‌ వాహనం రాత్రివేళ తరచుగా సరిహద్దు దాటి వస్తుండటంతో గుంటూరు పోలీసులు అనుమానించారు. ఆ మేరకు దృష్టి పెట్టి పట్టుకున్నారు.

ఆగని అక్రమాలు..

సరిహద్దు ప్రాంతాల వద్ద నిఘా కొరవడడంతో అక్రమార్కులకు వరంగా మారింది. నాగార్జునసాగర్‌, అడవిదేవులపల్లి, వాడపల్లి, మఠంపల్లి, కోదాడ నుంచి పీడీఎస్‌ బియ్యం, మద్యం, నిషేధిత పొగాకు ఆంధ్రా వైపునకు, గంజాయి తెలంగాణ వైపు రవాణా జరుగుతోంది. పీడీఎస్‌ బియ్యానికి సంబంధించి దాచేపల్లిలో ఒక మిల్లుకు సరకు రవాణా జరుగుతోంది. వాడపల్లి మీదుగా నిత్యం పదుల కొద్ది బొలేరో, లారీలు, ఆటోలలో బహిరంగంగా బియ్యం తరలింపు జరుగుతున్నా.. అధికారులు, పోలీసులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. సరిహద్దు వద్ద సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమాలు జరుగుతున్నాయని పలువురు వెల్లడించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.