ETV Bharat / crime

అదుపు తప్పి.. పల్టీ కొట్టి.. డివైడర్ దాటి.. బైకర్​పై పడిన కారు.. ఒకరు మృతి - car hit the divider at Kesari Bridge

road accident: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. . విజయవాడకు చెందిన ఓ కుటుంబం తిరుపతమ్మ అమ్మ వారి దర్శనానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా, వారి కారు వేగాన్ని అదుపు చేసుకోలేక పల్టీలు కొట్టి, డివైడర్‌ అవతల ప్రయాణిస్తున్న బైక్​పై పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

road accident
road accident
author img

By

Published : Jan 22, 2023, 8:09 PM IST

road accident: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై కేసర బ్రిడ్జి సమీపంలో కారు అదుపుతప్పిన ఘటనలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ మాచవరం మారుతి నగర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం తిరుపతమ్మ అమ్మ వారి దర్శనానికి కారులో వెళ్లి తిరిగి విజయవాడ వెళుతుండగా కేసరి వంతెన సమీపంలో అదపు తప్పిన కారు.. డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ కారు డివైడర్ ను దాటి హైదరాబాద్ వైపు వెళ్తున్న బైకర్​పై పడింది. ఈ సంఘటనలో కారులో ఉన్న ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్​పై ఉన్న వ్యక్తికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.