Jubileehills gang rape case: తెలంగాణలో సంచలనం రేకెత్తించిన జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నిందితులను కస్టడీకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. కీలక విషయాలు సేకరించారు. పెద్దమ్మ గుడి సమీపంలోని నిర్జన ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారు. బాలిక మెడపై టాటుల్లా ఉంటాయనే ఆలోచనతో పళ్లతో కొరికామని.. ఆమె ప్రతిఘటించడం వల్లే గాయాలయ్యాయని అంగీకరించారు. సాదుద్దీన్ ప్రోద్బలంతోనే అత్యాచారం చేశామని పోలీసులకు వెల్లడించారు. విచారణలో భాగంగా ఐదుగురు మైనర్లను జువైనల్ హోమ్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారిని అమ్నేషియా పబ్, కాన్సూ బేకరి ప్రాంతాలకు తీసుకెళ్లారు. రోడ్ నెంబర్ 36, 44కూ తీసుకెళ్లి సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేశారు. ఘటన జరిగిన తీరును పరిశీలించారు. నిందితులకు పలు ప్రశ్నలు సంధించిన పోలీసులు.. మళ్లీ జువైనల్ హోమ్‌కు తరలించారు.
ఎమ్మెల్యే కుమారుడే..: అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన సాదుద్దీన్‌ను పోలీసులు ప్రశ్నించారు. కీలక విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కేసును లోతుగా విచారించేందుకు సాదుద్దీన్‌ను ఈ నెల 10న పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 4 రోజుల పాటు విచారించి పలు వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే కుమారుడే బాలికతో మొదట అసభ్యంగా ప్రవర్తించాడని సాదుద్దీన్ పోలీసులకు తెలిపాడు. సాదుద్దీన్ కస్టడీ నేటితో ముగిసింది.
నిందితులకు బిర్యానీ ప్యాకెట్లు..: కేసులో నిందితులైన మైనర్లకు భోజన సమయంలో బిర్యానీ తీసుకెళ్లారని ప్రచారం జోరుగా సాగుతోంది. నిందితలకు తెలిసిన వాళ్లు.. జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌కు మధ్యాహ్నం వేళ ప్రత్యేక బిర్యానీ ప్యాకెట్లు తీసుకెళ్లారని సమాచారం. సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ అనంతరం ఐదుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కస్టడీ సమయంలో నిందితులకు పోలీసులో భోజనం పెట్టాల్సి ఉంది. అయితే.. ఆ సమయంలో బిర్యానీ ప్యాకెట్లు తీసుకెళ్లటంతో.. వీఐపీల విషయంలో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇదీ చదవండి :