Two dead in Accident: తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు వద్ద కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన బసవరాజు, మంజుగా గుర్తించారు. గిరీష్, శివరామ కృష్ణ, వెంకటేశ్ అనే ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కారులో నాయుడుపేట వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు.. ప్రమాదానికి గురైన కారు నెంబర్ - KA 36 B 5707 గా పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: