ETV Bharat / crime

బైక్​ను ఢీకొట్టి.. మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన లారీ - Road accident on national highway

Warangal Road accident : తెలంగాణలోని వరంగల్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఓ లారీ వెనక నుంచి ఢీకొట్టిన ఘటనలో కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా.. తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.

Warangal Road accident Today
Warangal Road accident Today
author img

By

Published : Jan 17, 2023, 7:55 AM IST

బైక్​ను ఢీకొట్టి మృతదేహాన్ని ఈడ్చుకెళ్లిన లారీ.. ఒళ్లు గగుర్పొడిచేలా 'సీసీ' దృశ్యాలు

Warangal Road accident : తెలంగాణలోని వరంగల్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని రాయపర్తి మండలం మైలారం చక్కు తండాకు చెందిన తల్లీకుమారుడు వరంగల్​-ఖమ్మం జాతీయ రహదారిపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఇరువురూ కింద పడిపోగా.. కుమారుడు బానోత్​ వెంకన్న లారీ చక్రాల కింద చిక్కుకుపోవడంతో లారీ అతడిని కొంత దూరం ఈడ్చుకు వెళ్లింది. దీంతో తల భాగం, మొండం వేరుకాగా అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి కైకకు తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి ఆమెను వెంటనే తమ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగడంతో వాహనాలు నిలిచిపోగా.. ట్రాఫిక్​ను క్రమబద్దీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద విషయం తెలుసుకుని ఆసుపత్రికి చేరుకున్న బంధువుల రోదనలు మిన్నంటగా.. ఘటనకు సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలు మరింత కలవరపరుస్తున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.