ETV Bharat / crime

తెలంగాణలో రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం - తుమ్మలూరు వద్ద రోడ్డు ప్రమాదం నలుగురి మృతి

Road Accident at Tummanoor: తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.

Road Accident at Tummanoor
Road Accident at Tummanoor
author img

By

Published : Feb 10, 2023, 7:50 AM IST

Road Accident at Tummanoor Today: తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి తుమ్మనూరు గేట్ సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారును డీసీఎం ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. వీరంతా హైదరాబాద్​లో జరిగిన ఓ శుభకార్యంలో వంట చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులను నాగర్​కర్నూల్ జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.

మృతులు నాగర్​కర్నూల్​ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన కేశవులు(35), యాదయ్య(34), శ్రీను(30), లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామస్వామి(32)గా పోలీసులు గుర్తించారు. నలుగురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పంపించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.