ETV Bharat / crime

తమిళనాడులోని పొన్నేరి వద్ద రోడ్డు ప్రమాదం.. నెల్లూరు జిల్లా వాసి మృతి - news updates ap

ROAD ACCIDENT IN TAMILNADU : తమిళనాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్​ నుంచి చెన్నై వెళ్తుండగా ఆంధ్రా ట్రావెల్స్​ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్​, క్లీనర్​ సహా మరో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు.

ROAD ACCIDENT IN TAMILNADU
ROAD ACCIDENT IN TAMILNADU
author img

By

Published : Dec 5, 2022, 3:05 PM IST

ROAD ACCIDENT AT TAMILNANDU : తమిళనాడు పరిధిలోని పొన్నేరి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పొన్నేరి వద్ద ఆంధ్రా ట్రావెల్స్ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో క్లీనర్‌, ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సు క్లీనర్ శ్రీధర్‌, నెల్లూరు జిల్లా విడవలూరుకు చెందిన తోకల సతీష్ కుమార్, బెంగళూరుకు చెందిన తుమ్మల రోహిత్ ప్రభాత్ అక్కడికక్కడే మృతి చెందారు. తమిళనాడు ఆర్టీసీ డ్రైవర్ జానకిరామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.