ETV Bharat / crime

RAPE ON MINOR GIRL: బాలికకు మాయమాటలు చెప్పి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. - కర్నూలు జిల్లా తాజా వార్తలు

RAPE ON MINOR GIRL: రోజురోజుకీ రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. వావి వరసలు మరచి.. చిన్నా, పెద్దా తేడా లేకుండా మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక మూల.. ఎక్కడో ఒకచోట బాలికలు లేదా మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతూనే ఉన్నాారు. యువతులు, మహిళలు ఒంటరిగా కనపడితే చాలు.. మగాళ్లు మృగాళ్లుగా మారి వారి జీవితాలను అంధకారం చేస్తూ.. వారు మాత్రం ఆనందాన్ని పొందుతున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు.

rape on minor girl
మైనర్ బాలికపై అత్యాచారం
author img

By

Published : May 4, 2022, 12:28 PM IST

RAPE ON MINOR GIRL: కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరంలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై 24 సంవత్సరాల యువకుడు అత్యాచారం చేశాడు. ముంబై నుంచి మాధవరంలో ఉన్న అమ్మమ్మ ఇంటికి వచ్చిన బాలికను అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు అత్యాచారం చేశాడు. అతడు ప్రైవేటు జాబ్​ చేస్తూ మాధవరంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం ముంబై వెళ్లిన బాలికకు తీవ్ర కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు అస్పత్రిలో చేర్చారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గర్భం దాల్చిందని చెప్పడంతో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముంబైలో యువకుడిపై కేసు నమోదు చేశారు. అయితే ముంబై పోలీసులు కేసును మంత్రాలయానికి బదిలీ చేయడంతో విషయం బయటకు వచ్చింది. ఈ ఘటనపై మంత్రాలయం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Children Missing: విశాఖ శిశుగృహం నుంచి ముగ్గురు చిన్నారులు అదృశ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.