RAPE ATTEMPT: రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనల పరంపర పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఓ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంటోంది. నంద్యాలలో నాలుగేళ్ల చిన్నారిని పదిహేడేళ్ల మైనర్ బాలుడి లైంగిక దాడి మరువక ముందే మరో ఘటన జరిగింది. నంద్యాల ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతంలో 11 ఏళ్ల బాలికపై 24 ఏళ్ల యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇవీ చదవండి: CBN: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు చంద్రబాబు లేఖ.. ఎందుకంటే..!