Interstate Thieves Arrest: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో పోలీసులకు కంటిపై కునుకు లేకుండా చేసిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు రైల్వే ఎస్పీ చౌడేశ్వరీ వెల్లడించారు. రైళ్లల్లో ప్రయాణికుల విలువైన వస్తువులే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. గుంతకల్లు జిల్లా పరిధిలోని నంద్యాలలో.. రైళ్లలో చోరీలకు పాల్పడిన సంతోష్, రామకృష్ణలను అదుపులోకి తీసుకుని.. తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఎట్టకేలకు వారు చేసిన దొంగతనాలు చెబుతుంటే పోలీసులు షాక్ తిన్నారు. నిందితుల నుంచి 77 సెల్ ఫోన్లు, 5 లాప్టాప్లు, 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
రైళ్లలో చోరీ చేసిన దొంగ సొమ్మును భద్రంగా తీసుకెళ్లేందుకు.. రైల్వే స్టేషన్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను సైతం ఈ దొంగలు వదల్లేదని ఎస్పీ వెల్లడించారు. కాజేసిన దొంగ సరుకును మరో మీడియేటర్ రామకృష్ణ ద్వారా అమ్మి.. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేశారని ఆమె తెలిపారు.
ఇవీ చదవండి: