GANJA SMUGGLING IN SRIKAKULAM: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని జమ్ము జంక్షన్ వద్ద ఈరోజు ఉదయం పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ఒడిశాలోని పర్లాకిమిడి వైపు నుంచి నరసన్నపేట వైపు వస్తున్న కారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. జమ్ము కూడలి వద్ద పోలీసులు తనిఖీ చేస్తున్న విషయాన్ని గ్రహించిన నిందితులు.. కారును అక్కడే వదిలేసి పారిపోయారు. కాసేపటి తర్వాత కారు అలాగే ఉండిపోవడం గమనించిన పోలీసులు.. సోదా చేయగా అందులో గంజాయి దొరికింది. కారుతో సహా గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
GANJA SMUGGLING IN SRIKAKULAM: కారులో గంజాయి తరలింపు.. పోలీసులను చూసి పరార్..! - శ్రీకాకుళం జిల్లాలో గంజాయి పట్టివేత
MARJUANA SMUGGLING IN AP: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని జమ్ము జంక్షన్ వద్ద ఆగి ఉన్న కారులో గంజాయిని గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలిస్తున్నారు.