ETV Bharat / crime

గుంటూరులో నకిలీ ఐటీ అధికారి గుట్టురట్టు.. వ్యాపార సంస్థలపై రెక్కి.. ఆ తర్వాత! - ap crime news

FAKE IT OFFICER ARREST IN VIJAYAWADA : వ్యాపార సంస్థలపై రెక్కీ నిర్వహించటం.. ఆపై నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ యజమానిని ఫోన్​లో బెదిరించి.. అందినకాడికి దోచుకోవటం.. ఇదీ గుంటూరుకు చెందిన నకిలీ ఐటీ అధికారి తిరుమలరెడ్డి తీరు.

FAKE IT OFFICER ARREST IN VIJAYAWADA
FAKE IT OFFICER ARREST IN VIJAYAWADA
author img

By

Published : Dec 27, 2022, 12:04 PM IST

FAKE IT OFFICER ARREST : చెడు అలవాట్లు .. డబ్బుపై మోజు అతన్ని అడ్డదారి తొక్కించాయి. నగదు కోసం నకిలీ ఆదాయపు శాఖ అధికారి అవతారమెత్తి పోలీసులకు అడ్డంగా దొరికాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన తిరుమలరెడ్డి.. పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత బంగారం దుకాణంలో పనిచేశాడు. ఆ సమయంలోనే దుకాణానికి ఆదాయపు శాఖ అధికారులు వచ్చి ఆడిటింగ్ చేసేవాళ్లు. అయితే ఆడిటింగ్ చేసినపుడు అధికారులు ఏం చేస్తారు ? ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలపై నిఘా పెడతారు ? ఎలా ఆడిటింగ్ చేస్తారు? అనే విషయాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. కరోనా ప్రభావంతో బంగారు ఆభరణాల దుకాణం మూతపడింది. దాంతో ఆదాయం సమకూరే మార్గం లేక బెట్టింగ్ ,రేసింగ్​లకు పాల్పడేవాడు. దీని కోసం అడ్డదారిలో నగదు సంపాదించేందుకు సిద్ధమయ్యాడు. అప్పుడే నకిలీ ఆదాయపు శాఖ అధికారి అవతారమెత్తాడు. ఆదాయపు శాఖ ఇన్స్​పెక్టర్ ధూళిపూడి కిషోర్ అనే పేరుతో విజయవాడలోని పలువురు వ్యాపారస్తులకు ఫోన్ చేసి .. డబ్బు చెల్లించాలని డిమాండ్ చేశాడు.

గుంటూరులో నకిలీ ఐటీ అధికారి గుట్టురట్టు

డబ్బివ్వకపోతే మీ సంస్థపై ఆడిటింగ్ చేస్తామని బెదిరించేవాడు. భయపడిన కొందరు చెల్లిస్తే.. మరికొందరు ఆ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆదాయపు పన్ను శాఖ జాయింట్ కమిషనర్ తమ సిబ్బంది పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేక బృందాలతో గాలించారు. నిందితుడు తిరుమలరెడ్డి ఇచ్చిన బ్యాంక్ ఖాతా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. అప్పుడే మనోడి బాగోతం బయటపడింది. తీగ లాగితే డొంక కదిలినట్లు బ్యాంకు ఖాతా ఆధారంగా విచారణ జరపగా.. ఆ ఖాతా ఓ బెగ్గర్​ది అని తేలింది. పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి తిరుమలరెడ్డిని నిందితుడిగా గుర్తించారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడే అతనిలోని మరో కోణం వెలుగుచూసింది. తిరుమల రెడ్డిపై గతంలో విశాఖ, గుంటూరు, చీరాల పోలీస్​స్టేషన్స్​లో కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.

నిందితుడు వ్యాపార సంస్థలకు వెళ్లి ముందుగా రెక్కీ నిర్వహించి .. ఆపై గూగుల్​లో ఫోన్ నెంబర్లు తీసుకుని ఫోన్ చేసి బెదిరించేవాడని పోలీసులు గుర్తించారు. తిరుమల రెడ్డి నుంచి 10 వేల రూపాయల నగదు ,సెల్​ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఆదాయపు పన్ను శాఖ అధికారుల పేరుతో ఫోన్​చేసి బెదిరిస్తే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరుతున్నారు.

"ఇతను ఏమి ఆడిటర్​గా వెళ్లి రైడ్​ చేయలేదు. రైడ్​కి వస్తామని చెప్పి బెదిరించి వ్యాపారుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. అతని దగ్గర నుంచి 10వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసు విచారణ జరుగుతుంది. ప్రజలకు మా విజ్ఞప్తి ఏమిటంటే.. మిమ్మల్ని ఎవరైనా ఫోన్​లు చేసి బెదిరిస్తే మాకు ఫిర్యాదు చేస్తే మేము విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం"-రవికిరణ్, విజయవాడ సౌత్‌ జోన్‌ ఏసీపీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.