Lecturer Arrest in Student Suicide Case: తరగతి గదిలో తనను తోటి విద్యార్థుల ముందు లెక్చరర్ మందలించిందని మనస్థాపం చెందిన అన్సు యాదవ్ అనే విద్యార్థిని మృతి చెందిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. విద్యార్థి మృతికి కారణమైన కెమిస్ట్రీ లెక్చరర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతికి గల కారణాలపై విచారణ చేపట్టారు. తన చావుకు మరో ముగ్గురు అధ్యాపకులు.. తన రూంమేట్ కారణం అంటూ సూసైడ్ నోట్లో పేర్కొనడంతో ఆ దిశగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న కేసులో ఓ కెమిస్ట్రీ లెక్చరర్‌ను భీమిలి పోలీసులు అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం జోన్ కాపులుప్పాడ చైతన్య టెక్నో స్కూల్లో ఈనెల 25న అన్సు యాదవ్(17) అనే విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. లెక్చరర్ మందలించడంతోనే ఆ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిలో భాగంగా లెక్చరర్ లలితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రింద పడిపోయిన తన పరీక్ష పేపర్ వేరే విద్యార్థిని తనకు ఇవ్వగా.. దానిపై కెమిస్ట్రీ లెక్చరర్ అన్సు యాదవ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలిసింది.
పరీక్షా పత్రాన్ని ఎందుకు దాచి పెట్టావని తరగతి గదిలో ఈ నెల 25న తోటి విద్యార్థుల ముందు లెక్చరర్ అడగడంతో ఆ విద్యార్థిని మనస్థాపానికి గురైంది. అదేరోజు లేఖ రాసి తన చావుకు కెమిస్ట్రీ లెక్చరర్ల లలితతో పాటుగా మరో ముగ్గురు అధ్యాపకులు.. తన రూంమేట్ కారణమని పేర్కొంది. వారి పేర్లను సైతం అన్సు అందులో ప్రస్తావించినట్లు పోలీసులు వెల్లడించారు. మరుసటి రోజు సాయంత్రం హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకొని ప్రాణాలు తీసుకుందని పోలీసులు పేర్కొన్నారు. అన్సు యాదవ్ ఆత్మహత్యపై ఆమె తండ్రి పరమేశ్వర్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కె. లక్ష్మణ్ మూర్తి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా కెమిస్ట్రీ లెక్చరర్ లలితను అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి: