ETV Bharat / crime

Loan Apps: లోన్​ యాప్​ మోసాలు.. మరో ఐదుగురు అరెస్ట్​

Loan App: లోన్​యాప్​ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఐదుగుర్ని కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఐదుగురిని అరెస్టు చేయగా ప్రస్తుతం మరో ఐదుగురిని అరెస్టు చేశారు. వీరు వినియోగిస్తున్న సర్వర్లను ఇతర దేశాలలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Loan App Frauds
కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా
author img

By

Published : Sep 29, 2022, 9:52 PM IST

Loan App Frauds: ఆన్‌లైన్​లోన్ వేధింపుల కేసులో మరో ఐదుగురిని కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారం రోజుల క్రితమే కొంతమందిని అరెస్ట్ చేశామని.. లోతైన విచారణ చేపట్టి మరో ఐదుగుర్ని అరెస్ట్ చేశామని ఎస్పీ జాషువా తెలిపారు. లోన్ యాప్​ ఏజెంట్ల అరెస్టులపై మచిలీపట్నం ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. ఏఎస్పీ రామాంజనేయులు నేతృత్వంలోని సిట్ బృందం.. నిందితుల్ని దిల్లీలో అరెస్ట్ చేసిందని తెలిపారు.

అరెస్టు అయిన నిందితులు ఒకరికొకరు తెలియకపోవడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. ఆన్‌లైన్‌ లోన్ మంజూరు చేసి తర్వాత ఈఎంఐల రూపంలో వసూళ్లు చేసిన మొత్తాన్ని ఎవరి వాటాలను సర్దుబాటు చేయటమే ఈ ముఠా పని అని తెలిపారు. నిందితులు వినియోగిస్తున్న సర్వర్లు చైనా, పాకిస్థాన్, మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో గుర్తించామన్నారు. నిందితుల బ్యాంక్ ఖాతాలలో ఉన్న సుమారు 23 లక్షల నగదును జప్తు చేశామని ఎస్పీ తెలిపారు.

కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా

గతంలో ముగ్గురి అరెస్టు: ఇదే కేసులో గతంలో పోలీసులు ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరు లోన్​యాప్​ల ద్వారా లోన్​ మంజూరు చేస్తుంటారని పోలీసులు తెలిపారు. మంజూరైన మొత్తాన్ని నెలల వాయిదాలో వసూలు చేసకుని.. రుణం తీరిన తర్వాత కూడా వేధింపులకు పాల్పడుతూ.. మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. పెనమలూరు, ఆత్కూరు స్టేషన్​లలో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. ప్రస్తుతం ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.