రుణాల యాప్‌ల ద్వారా 30 వేల కోట్ల లావాదేవీలు నిర్వహించిన చైనీయులు. పోలీసులు స్తంభింపజేసిన తమ ఖాతాల్లో నగదు నిల్వలను విత్ డ్రా చేసుకునేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల పేరును వినియోగించుకున్నారు. గుర్గావ్, నోయిడా, దిల్లీ, బెంగుళూరు, కోల్‌కతా నగరాల్లో పోలీసులు స్తంభింపజేసిన 300 కోట్ల నగదును ఎలాగైనా మళ్లీ కొట్టేసేందుకు ఈ ఎత్తుగడ వేశారు. ఇందుకోసం మూడు నెలల క్రితం చైనీయులు ప్రణాళిక సిద్ధం చేశారని పోలీసులు గుర్తించారు.
పోలీసుల పేరుతో టోకరా..
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని బేగంపేట కాల్ సెంటర్‌కు వస్తున్న ఆనంద్ అనే సైబర్ నేరస్థుడి వివరాలు తెలుసుకుని పథకం అమలు చేస్తే ఖాతాల్లోని సొత్తు కాజేయేచ్చని భావించారు. డీల్‌కు అతను అంగీకరించాక సైబర్ క్రైమ్స్ ఎస్సైగా కోల్‌కతా కు పంపించి రెండు బ్యాంక్ ఖాతాల్లోని 1.18 కోట్ల నగదును విడుదల చేయించుకున్నారు. నకిలీ ఎస్సైగా వెళ్లిన నిందితుడిని పట్టుకుంటే తెరవెనుక చైనీయులను బయటకు వస్తారని అంచనాతో ఎస్సై కోసం గాలిస్తున్నారు. నకిలీ ఎస్సై బ్యాంక్ అధికారులను బెదిరించి నగదును బేగంపేటలో ఉంటున్న తన స్నేహితుడు ఆనంద్ బ్యాంక్ ఖాతాల్లో జమ చేయించాడు. తన బ్యాంక్ ఖాతాలో డబ్బు రాగానే ఆనంద్.. నకిలీ ఎస్సై సూచించిన బ్యాంక్ ఖాతాల్లోకి వెంటనే మార్చేశాడు. ఈ కేసులో రెండు రోజుల క్రితం ఆనంద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి కీలక ఆధారాలు సేకరించారు.
నకిలీ ఎస్సై..
బేగంపేట ఎయిర్పోర్ట్ ఉద్యోగుల కాలనీలో ఉంటున్న ఆనంద్ ఒక రియల్టర్. ఆనంద్‌కు నకిలీ ఎస్సైగా నటించిన నిందితుడు ఒక స్నేహితుడిగా పరిచయమయ్యారు. ఒక ఆఫర్ ఉంది.. మనం చేస్తే కోట్లు వస్తాయని ఆనంద్‌ను నకిలీ ఎస్సై ప్రభావితం చేశాడు. చైనీయుల నుంచి ఆదేశాలు రావడంతో రెండు నెలల క్రితం ఇద్దరూ తమ పనులు పూర్తి చేశారు. తన తెలివితేటలు ఉపయోగించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్టేషన్ పేరుతో ఆనంద్ నకిలీ లేఖలను గుర్గావ్ లోని ఐసీఐసీఐ బ్యాంక్ కు పంపించాడు. ఆనంద్ స్నేహితుడు మాత్రం ఎస్సైగా కోల్‌కతాకు వెళ్లాడు. బ్యాంకు అధికారుల వద్ద ఎస్సైగా చలామణి అయి ఖాతాల్లోని నగదును బదిలీ చేయుంచుకున్నాడు.
ఖాతాలు ఖాళీ..
అయితే ...రుణ యాప్‌ల కేసుల విచారణాధికారిగా ఉన్న ఇన్ స్పెక్టర్ ప్రశాంత్..దేశవ్యాప్తంగా బ్యాంకుల్లో స్తంభింపజేసిన నగదు నిల్వల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఏప్రిల్ నెల మొదటి వారంలో కోల్‌కతాలోని ఐసీఐసీఐ అలీపూర్ ద్వార్ శాఖలో చైనా కంపెనీల డబ్బు లేదని గుర్తించారు. గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ ప్రాంతీయ కార్యాలయం అధికారులను సంప్రదించి..కోల్‌కతాలోని డబ్బును ఇతర ఖాతాలకు మళ్లించి వివరాలు చెప్పాలని కోరారు. ఐసీఐసీఐ బ్యాంక్ అధికారులు అంతర్గతంగా విచారణ చేపట్టి నెలరోజుల తర్వాత అధికారికంగా నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా 1.18 కోట్లు తీసుకున్న ఆనంద్‌ను నిందితుడిగా గుర్తించారు. ఆనంద్‌తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అని అతడి కదలికలపై నిఘా ఉంచారు. నకిలీ ఎస్సైగా నటించిన నిందితునికోసం గాలిస్తున్నారు.
ఇదీ చదవండి :