ETV Bharat / crime

Arrest: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇప్పిస్తానని మోసం.. ఒకరు అరెస్టు

Arrest: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న నెల్లూరు జిల్లా వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చాలా మందిని నమ్మించి దాదాపు కోటి రూపాయలకు పైనే డబ్బులు వసూలు చేశాడని విచారణలో తెేలిందని తిరుమల ఎస్సై సాయినాథ చౌదరి చెప్పారు.

man arrest in cheating case
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇప్పిస్తానని మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు
author img

By

Published : Apr 1, 2022, 11:52 AM IST

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇప్పిస్తానని మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు

Arrest: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా చీరాలకు చెందిన లలిత్‌ కుమార్‌ గతంలో తితిదే పరకామణిలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేశాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి దేవాలయానికి వచ్చే యాత్రికులకు టికెట్టు ఇప్పిస్తానంటూ నమ్మిస్తూ లక్షలో వసూలు చేయడం మెుదలుపెట్టాడు.

2017లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆంజనేయులు అనే భక్తుడికి అభిషేకం టికెట్టు ఇప్పిస్తానంటూ 85 వేల రూపాయలు తీసుకొని మోసం చేసినట్టు ఆ భక్తుడు ఫిర్యాదు చేశాడు. అలాగే 2021లో హైదరాబాద్‌కు చెందిన మణికంఠ నుంచి 30 వేలు, తమిళనాడుకు చెందిన జీవనకృష్ణ దగ్గర 49 వేల రూపాయలు వసూలు చేశాడు. వీరే కాగా ఇలా చాలా మందిని నమ్మించి దాదాపు కోటి రూపాయలకు పైనే డబ్బులు వసూలు చేశాడని విచారణలో తెేలిందని తిరుమల ఎస్సై సాయినాథ చౌదరి చెప్పారు.

ఇదీ చదవండి: Money seized in private bus: ప్రైవేట్ బస్సులో రూ.2 కోట్లు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.