ACCIDENT: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బస్సు ప్రమాదానికి గురైంది. బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో యాత్రికులతో కూడిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా వెల్మల్‌కు చెందిన సరలమ్మ(70) మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఔరంగాబాద్ పట్టణంలో చికిత్స అందిస్తున్నారు.
ఈ నెల 24న 38 మంది యాత్రికులతో కూడిన ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ నుంచి కాశీ యాత్రకు బయలుదేరింది. బస్సులో నిజామాబాద్ జిల్లా వెల్మల్, దత్తపూర్, తలవేద, డొంకేశ్వర్‌తో పాటు పాటు నిర్మల్ జిల్లా బాసరకు చెందిన యాత్రికులు ఉన్నారు. ఔరంగాబాద్‌లో ఓ హోటల్ వద్ద బస్సు ఆపుతుండగా వెనుకనుంచి లారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. బస్సు దెబ్బతినడంతో తమకు రవాణా సౌకర్యం తో పాటు.. మృతదేహాన్ని తరలించేలా చూడాలని యాత్రికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: