విజయనగరంలోని జేఎన్టీయూ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బోర్వెల్ లారీ అదుపుతప్పి తిరగబడిన ఘటనలో డ్రిల్ బిట్స్ మీద పడి ముగ్గురు వ్యక్తులు లారీ కింద చిక్కుకున్నారు.
తరలిస్తుండగా..
స్థానికుల సహకారంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు క్షతగాత్రులను మహారాజా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.