Oil mill owner suicide: కడపలో ఓ నూనె మిల్లు యజమాని.. రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. విజిలెన్స్ అధికారులు తనపై తప్పుడు కేసు పెట్టి అవమాన పరిచారనే మనస్థాపంతోనే చనిపోతున్నానంటూ.. కడపకు చెందిన రామకృష్ణా రెడ్డి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల విజిలెన్స్ అధికారులు రామకృష్ణారెడ్డికి సంబంధించిన నూనె మిల్లులు తనిఖీ చేసి.. అధిక నిల్వలు ఉన్నాయంటూ కేసు నమోదు చేశారు. కావాలనే తనపై తప్పుడు కేసు పెట్టారనే అవమానంతో చనిపోతున్నానంటూ.. లేఖలో రాసి ఉంది. విజిలెన్స్ అధికారుల వేధింపులు వల్లే రామకృష్ణా రెడ్డి చనిపోయాడని.. నూనె మిల్లు యజమానులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:
Suicide: 'నా కుటుంబంతో సంతోషంగా లేను... అందుకే నా కుతురిని కూడా..!'