ETV Bharat / crime

తల్లిదండ్రులు ఆలోచిద్దాం అన్నారు.. కానీ ఆ బాలుడు - రైలు కిందపడి మైనర్ బాలుడు ఆత్మహత్య

Minor Boy Suicide for Love Issue: ఒక్కసారి ప్రేమిస్తే చాలు.. ప్రాణాలిచ్చేందుకు కూడా వెనకాడరు. తనను ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుంటే.. తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడం చూస్తున్నాం. కొందరు తమ ప్రేమను ఇంట్లో చెబితే ఒప్పుకుంటారో లేదోనని ముందే భయపడి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మైనర్ తన ప్రేమను ఇంట్లో చెప్పగా.. వారు కాస్త ఆగి ఆలోచిద్దాం అనడంతో.. మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Minor Boy Suicide for Love Issue
Minor Boy Suicide for Love Issue
author img

By

Published : Nov 14, 2022, 5:35 PM IST

Minor Boy Suicide for Love Issue: ఒకరి ప్రేమ జీవిత భాగస్వామిని కోరుకుంటుంది.. మరొకరి ప్రేమ పిల్లల భవిష్యత్​ కోసం పరితపిస్తుంది. ఒక మనసు పెద్దల్ని అయినా ఎదరించమంటుంది.. మరో మనసు సమాజ అడ్డుగోడలు దాటలేక సతమతమవుతుంది. ఎన్నో అవరోధాలు ఎదురవుతాయని తెలిసినప్పటికీ... కలిసి బతకాలనే కోరిక వారిని ముందుండి నడిపిస్తుంది. అయితే ఆ ప్రేమ వయసు పరిణితి చెందిన తరువాత అయితే ఇంకా బాగుంటుంది. తెలిసీ తెలియని వయసులో కలిగే ఆకర్షణను ప్రేమగా ఊహించుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు కొందరు. తాజాగా సికింద్రాబాద్​లో కన్నవారు తన ప్రేమను కాదన్నారనే మనస్తాపంతో.. ఓ మైనర్ బాలుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన సంతోష్ అనే 17 ఏళ్ల మైనర్ బాలుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ధైర్యం చేసి తన ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. దాంతో వారు వెంటనే ఒప్పుకోకుండా మరో సంవత్సరం ఆగిన అనంతరం ఆలోచిద్దామని చెప్పారు. వారి సమాధానానికి సంతోష్ మనస్తాపానికి గురయ్యాడు. దాంతో ఇవాళ ఇంట్లో నుంచి బయలుదేరిన బాలుడు సికింద్రాబాద్​లో గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులు తన ప్రేమ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.