ETV Bharat / crime

Dowry Harassment: వరకట్న దాహానికి వివాహిత బలి - kurnool crime news

Dowry Harassment: ఎన్ని చట్టాలు వచ్చిన, ఎన్ని కోర్టులు శిక్షలు వేసిన వరకట్న బాధితుల మరణాలు మాత్రం తగ్గడం లేదు. భర్త ధనదాహనికి, అత్తమామల చీదరింపులకు ఎక్కడో ఒకరు వారి ప్రాణాలను బలితీసుకుంటూనే ఉన్నారు. తాజాగా ఇలాంటిదే ఓ మహిళకు జరిగింది. ఆమెకు పెళ్లైన ఎనిమిది నెలలకే వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది.

Dowry Harassment
వరకట్న దాహనికి వివాహిత బలి
author img

By

Published : Mar 25, 2022, 3:40 PM IST

Dowry Harassment: పెళ్లై ఎనిమిది నెలలు అయ్యింది. పెళ్లి సమయంలో కట్నకానుకల కింద 50 లక్షలు ఇచ్చారు. అంతా బానే ఉంది అనుకున్న సమయంలో అదనంగా 20 లక్షలు తీసుకుని రావాలని భర్త, అత్తమామల వేధింపులు మొదలుపెట్టారు. ఇక ఆ నరకాన్ని భరించలేక వివాహిత ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కడప శివారులోని బృందావన్ కాలనీలో జరిగింది. వనితకు బాబా రెడ్డి అనే వ్యక్తితో 2020 ఆగస్టులో వివాహమైంది. ఈమె ఎంబీఏ వరకు చదివింది. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం చేస్తోంది. ఈ నేపథ్యంలో వేధింపులు భరించలేక వనిత ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: Today Crime: పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని.. గిరిజన విద్యార్థి ఆత్మహత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.