ETV Bharat / crime

కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ప్రియురాలి ఎంట్రీ.. తెలుగు సినిమాల్లోని ట్విస్ట్​​ రిపీట్​ - ప్రియురాలి రాకతో ఆగిపోయిన వివాహం

Marriage Stopped: కాసేపట్లో పెళ్లి ముహుర్తం.. బంధువులందరి చేతుల్లో అక్షతలు.. పంతులు నోట వేద మంత్రాలు.. మేళతాళాల చప్పుడు.. వధువు మెడలో వరుడు తాళి కట్టటమే తరువాయి. ఇంతలోనే.. ఆపండీ... అంటూ ఓ యువతి అరుపు.. కట్​ చేస్తే.. పెళ్లి ఆగిపోవటం.. ఫ్లాష్​బ్యాక్​ స్టోరీ..!! ఇదంతా తెలుగు సినిమాల్లోని పెళ్లి సన్నివేశాల్లో మనం తరచూ చూసేదే. అయితే.. అచ్చంగా ఇదే సన్నివేశం నిజజీవితంలోనూ జరిగింది. నమ్మట్లేదా.. అయితే ఈ స్టోరీ చదివేయండి..

marriage
marriage
author img

By

Published : Aug 10, 2022, 7:53 PM IST

Marriage Stopped: ఆగస్టు 10, బుధవారం ఉదయం 10 గంటల 35 నిమిషాలకు పెళ్లి. మండపంలో పెళ్లి పెద్దల హడావిడి.. బంధువుల సందడి.. హుషారైన పాటలతో అక్కడి వాతావరణమంతా కోలాహలంగా ఉంది. సమయం సరిగ్గా 10 గంటలా 30 నిమిషాలు. ముహూర్తం దగ్గరపడిందని.. పెళ్లి పందిట్లో ఉన్న పంతులు ఓవైపు తొందర పెడుతున్నాడు. మరోవైపు పెళ్లి పనుల్లో నిమగ్నమైపోయిన పెళ్లిపెద్దలు ఆగమాగమవుతున్నారు. ఇంతలో వివాహ మండపంలోకి ఒక యువతి వచ్చింది.

ఆమె రాకతో అక్కడ సీనంతా రివర్సయ్యింది. పెళ్లి మండపంలో అప్పటి వరకు ఉన్న సందడంతా ఆవిరైపోయింది. ఎన్నో ప్రశ్నలతో బంధువులు నివ్వెరపోయారు. ఎందుకంటే.. అందరిలా తానూ.. ఆ పెళ్లికి వచ్చిన బంధువు కాదు. కనులారా పెళ్లి చూసి.. నాలుగు అక్షతలు వేసి.. వధూవరులన దీవించి.. వింధు ఆరగించి.. వెళ్లోస్తానని చెప్పిపోడానికి.. స్నేహితురాలు అంతకన్నా కాదు. పెళ్లి పీటలపై కూర్చుని కాసేపట్లో వధువు మెడలో తాళి కట్టేందుకు సిద్ధంగా ఉన్న వరుడు ప్రేమించిన ప్రేయసి ఆమె.

మండపానికి వచ్చీరాగానే.. తనకు జరుగుతున్న మోసాన్ని బంధువులందరి సమక్షంలో వివరించింది ఆ యువతి. తనను ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి.. ఇప్పుడు మరో అమ్మాయిని వివాహం చేసుకుంటున్నాడని.. కన్నీళ్లు పెట్టుకుంటూనే.. పెళ్లికొడుకును నిలదీసింది. ఆ యువతి మాటలు విన్న బంధువులంతా.. హవ్వా.. అంటూ ముక్కున వేలేసుకున్నారు. వధువు తరఫు బంధువులు నిచ్ఛేశ్టులయ్యారు. ఇంకేముంది.. పాత తెలుగు సినిమాల్లోలాగా.. వరుడు మోసం తెలిసిన వధువు తరఫువాళ్లు మూడు తిట్లు, ఆరు శాపనార్థాలతో ఆ పెళ్లిని విరమించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ తతంగమంతా.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గద్దరాగడి గ్రామంలోని బీమా గార్డెన్లో చోటు చేసుకుంది.

హుజూరాబాద్​లో నివాసముండే రమీనాకు ఇదివరకే వివాహం కాగా విడాకులయ్యాయి. ఈ క్రమంలో రామకృష్ణాపూర్ చెందిన రాజు అనే సాఫ్ట్​వేర్​ ఉద్యోగితో పరిచయం ఏర్పడి అది కాస్తా.. ప్రేమగా మారింది. రమీనా, రాజు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రాజుకు ఇటీవల.. గోదావరిఖనికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలుసుకున్న రమీనా మాత్రం.. ముహుర్తానికి ముందే మండపంలోకి ఎంట్రీ ఇవ్వటంతో.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ తతంగమంతా అయిపోయాక.. రామకృష్ణాపూర్ పోలీస్​స్టేషన్​లో రమీనా.. తనకు జరుగుతున్న మోసంపై ఫిర్యాదు చేసింది.

కాసేపట్లో పెళ్లి.. అంతలోనే ప్రియురాలి ఎంట్రీ.. తెలుగు సినిమాల్లోని ట్విస్ట్​​ రిపీట్​

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.