కృష్ణా జిల్లా తిరువూరు మండలం టేకులపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భార్య, కుమారుడిపై సత్యనారాయణరెడ్డి(60) అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య పద్మావతి(55) అక్కడికక్కడే మరణించగా...కుమారుడు చిన్నబాబు పరిస్థితి విషమంగా ఉంది. ఉన్నతవైద్యం కోసం అతడిని విజయవాడ తరలించారు. ఘటనా స్థలానికి చేరుకుని తిరువూరు పోలీసులు విచారణ చేపట్టారు. సత్యనారాయణరెడ్డి పరారవుతుండగా నూజివీడు పోలీసులు పట్టుకున్నారు. కుటుంబకలహాలతోనే దాడి జరిగినట్లు స్థానికులు వెల్లడించారు.
సత్యనారాయణరెడ్డి పెద్ద కుమారుడు లండన్లో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు టేకులపల్లిలో కిరాణాదుకాణం నిర్వహిస్తున్నారు.. తనకు ప్రతి నెలా ఖర్చుల నిమిత్తం రూ. 20 వేలు కావాలని భార్య, కుమారులను గత కొంత కాలంగా సత్యనారాయణ రెడ్డి వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో తిరువూరు పట్టణంలో ఉన్న ఇంటి తాలుకా అద్దె డబ్బుల వద్ద సత్యనారాయణ రెడ్డి తన భార్య పద్మావతితో ఘర్షణ పడటంతో రెండు రోజుల కిందట ఆమె తిరువూరు పోలీసులను ఆశ్రయించింది. మరింత ఆగ్రహానికి గురైన సత్యనారాయణ రెడ్డి ఈ దారుణానికి పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: