ETV Bharat / crime

బిట్‌కాయిన్ల పేరుతో మోసాలు.. వ్యక్తి అరెస్ట్​!

క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసగించిన ఓ వ్యక్తిని హైదరాబాద్​ చాదర్​ఘాట్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆన్​లైన్​లో కరెన్సీ వ్యాపారం చేస్తున్నామని... డబ్బులు అప్పుగా ఇస్తే వడ్డీతో పాటు వాటా ఇస్తామని స్థానికులను మోసం చేశారు.

author img

By

Published : Jun 24, 2021, 6:03 PM IST

bitcoins  Fraud
బిట్‌కాయిన్ల పేరుతో మోసం

బిట్‌ కాయిన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సంతోష్‌ అనే వ్యక్తిని హైదరాబాద్‌ చాదర్‌ఘాట్‌ పోలీసులు అరెస్టు చేశారు. క్రిప్టో కరెన్సీ వ్యాపారం చేస్తున్నామని, తమకు డబ్బులు ఇస్తే అధిక లాభాలు వస్తాయని నిందితుడు పలువురిని నమ్మించి డబ్బులు వసూలు చేశాడు. నెలలు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో.. బాధితులు ఫిర్యాదు చేశారు.

డబ్బులు ఇవ్వకపోగా... అడిగిన వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితలు పోలీసుల వద్ద వాపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారుల నుంచి దాదాపు 38 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సంతోష్​ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను దర్యాప్తు పూర్తయిన అనంతరం వెల్లడిస్తామని పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి:

CBI Former JD: కౌలు రైతుల కష్టాలు తెలుసుకునేందుకే సాగు చేస్తున్నా: లక్ష్మీనారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.