తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాల పాలైన బాధితుడు.. చికిత్స పొందుతూ ప్రాణలు విడిచాడు.
గాంధీ చౌక్‌కు చెందిన బోనగిరి అంకుశ్ (23) తండ్రి సంజయ్‌తో కలిసి.. బైక్‌పై బైల్ బజార్ నుంచి బస్టాండ్ వైపునకు వెళ్తున్నాడు. యూటర్న్ తీసుకొనే క్రమంలో.. లారీ వీరిని ఢీ కొట్టింది. ఘటనలో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా.. అంకుశ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోవైపు తండ్రి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అతి వేగంగా లారీ నడిపిన డ్రైవర్ బషీర్ అహ్మద్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఐదుగురికి గాయాలు