ETV Bharat / crime

Loan App: ఆగని లోన్​ యాప్​ నిర్వాహకుల బెదిరింపులు... చివరికి మంత్రులకు కూడా - ఏపీ ప్రధాన వార్తలు

Loan App Representatives: అత్యవసర పరిస్థితుల్లో లోన్​ తీసుకుని సకాలంలో కట్టకపోతే లోన్​యాప్​ నిర్వాహకులు రెచ్చిపోతున్నారు.. నిత్యం ఫోన్లు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు మహిళల ఫొటోలను న్యూడ్​గా మార్చి వాట్సప్​ గ్రూప్​లలో షేర్​ చేస్తున్నారు. వీరి ఆగడాలు భరించలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. వీరి చర్యలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. వీరి బెదిరింపులు సామాన్యులకే కాదు.. ఆఖరికి మంత్రులు, మాజీ మంత్రులకు కూడా ఎదురైంది. ఇంతకు వారు ఎవరంటే..!

loan app
loan app
author img

By

Published : Jul 29, 2022, 6:57 PM IST

Updated : Jul 29, 2022, 7:26 PM IST

Minister Kakani Govardhan Reddy: లోన్‌ యాప్‌ నిర్వాహకులు బరి తెగించారు. ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌కు కూడా వీరి నుంచి బెదిరింపులు తప్పలేదు. ఓ వ్యక్తి లోన్‌ తీసుకుని ప్రత్యామ్నాయ ఫోన్‌ నెంబర్‌ను మంత్రిది ఇచ్చాడు. దీంతో యాప్‌ నిర్వాహకులు లోన్‌ కట్టాలంటూ ఏకంగా కాకాణికే ఫోన్‌ చేశారు. తమకేమీ సంబంధం లేదని మంత్రి పీఏ సమాధానమిచ్చినా వారు ఫోన్‌ చేయడం మానలేదు. లోన్‌ చెల్లించాల్సిందేనంటూ మంత్రికి 79 సార్లు ఫోన్‌ చేశారు. వీరి ఆగడాలు శృతి మించడంతో మంత్రి కాకాణి.. జిల్లా ఎస్పీ విజయారావుకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు చెన్నైలోని యాప్‌ నిర్వాహకులను అరెస్టు చేశారు. నెల్లూరు కలెక్టర్‌ కార్యాలయంలో కాపు నేస్తం కార్యక్రమానికి హాజరైన మంత్రి.. యాప్‌ నిర్వాహకుల వేధింపులపై స్పందించారు.

ఆగని లోన్​ యాప్​ నిర్వాహకుల బెదిరింపులు... చివరికి మంత్రులకు కూడా

‘‘ముత్తుకూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఉండగా నా నంబర్‌కు 79సార్లు ఫోన్‌ చేశారు. నాకు ఎందుకు ఫోన్‌ చేశారనే విషయంపై ఆరా తీస్తే.. రుణం తీసుకున్న అశోక్‌కుమార్‌ నా నంబర్‌ ప్రత్యామ్నాయంగా ఇచ్చారని చెప్పారు. అందుకే ఫోన్‌ చేస్తున్నామని చెబుతున్నారు. పోలీసులు వివరాలు సేకరించి నలుగురిని అరెస్టు చేశారు. వారిని విడిపించేందుకు 10మంది ప్రముఖ న్యాయవాదులు రావడం ఆశ్చర్యంగా ఉంది. లోన్‌యాప్‌ ముఠాను ట్రాప్‌ చేసేందుకు.. పోలీసుల విచారణలో భాగంగా మా పీఏ రూ.25వేలు చెల్లించారు. లోన్‌యాప్‌ నిర్వాహకుల వేధింపులు రోజు రోజుకూ శృతిమించుతున్నాయి. వీరి ఆగడాలు భరించలేక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మంత్రిగా ఉన్న నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆలోచించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లా. ఆంధ్రాలో వారి ఆటలు సాగకపోవడంతో చెన్నై నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బాధితులకు తాము అండగా ఉంటామని, ఎవరైనా వేధింపులకు పాల్పడితే తన దృష్టికి, పోలీసుల దృష్టికి గానీ తీసుకురావాలి’’ -కాకాణి గోవర్థన్​రెడ్డి, మంత్రి

SP Vijaya Rao: రుణాల పేరుతో వేధిస్తే ఫిర్యాదు చేయండి: రుణాల పేరుతో ఎవరైనా వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని నెల్లూరు ఎస్పీ విజయారావు తెలిపారు. ‘‘కొందరు వ్యక్తులు మంత్రి కాకాణికి ఫోన్‌ చేసి లోన్‌ కట్టాలన్నారు. ఫోన్‌ కాల్స్‌తో విసిగిపోయిన మంత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. నిందితులు కోల్‌మేన్స్‌ సర్వీసెస్‌ అనే రికవరీ ఏజెన్సీ నుంచి కాల్‌ చేశారు. ఎవరో లోన్‌ తీసుకుంటే మంత్రికి ఫోన్‌ చేసి రుణం కట్టాలన్నారు’’ అని జిల్లా ఎస్పీ వివరించారు.

Ex Minister Anilkumar: మాజీ మంత్రి అనిల్​కి​ సైతం కాల్​: రుణయాప్​ కంపెనీల ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది. తాజాగా ఈ ఖాతాలో మంత్రి కాకాణితో పాటు, మాజీ మంత్రి అనిల్​ కుమార్​ యాదవ్​కు రుణయాప్​ల వేధింపులు తప్పలేదు. తాజాగా ఫ్లట్రన్‌ రుణయాప్​ నుంచి అనిల్​కు ఫోన్​ వచ్చింది. మీ బావమరిది రుణం తీసుకున్నారంటూ ఓ మహిళ కాల్​ చేసింది. తనకు బావమరిది లేరని అనిల్‌ చెప్పినా మహిళ వినిపించుకోలేదు. అయితే ఈ ఘటనపై ఐజీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ముత్తుకూరు పీఎస్‌ నుంచి ఆడియో లీక్‌ అయినట్లు అనిల్‌ గుర్తించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 29, 2022, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.