కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన ఇద్దరిని కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 30 లక్షల రూపాయల విలువ చేసే 34 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. నిందితులు కడపజిల్లా రాయచోటికి చెందిన కట్టుబడి రత్నం, అనంతపురం జిల్లాకు చెందిన జంగాల మురళీలుగా గుర్తించారు.
నిందితులపై కడప, చిత్తూరు జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు తెలిపారు. వీరు ఎక్కువగా పల్సర్ బైకులను చోరీ చేసి తక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకునేవారని ఎస్పీ వెల్లడించారు. పల్సర్ బైకులకు గిరాకీ బాగా ఉండటంతోనే... వాటినే లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడేవారని వివరించారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరు పరిచి రిమాండుకు తరలించినట్లు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: DRUGS CASE : డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. విచారణకు హాజరైన పూరి