తెలుగు రాష్ట్రాల్లో వరుసగా ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్నఅంతరాష్ట్ర దొంగల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15 లక్షల విలువైన 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు.. రాజేశ్, సాయిగుప్త, మహేంద్రలు.. నంబర్ లేని బైక్‌పై పెరవలి వై జంక్షన్ వద్ద తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వాళ్ల నుంచి ఒక లాప్ ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో పలు కేసులు కూడా నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: పోలవరం మూలలంకలో ఎన్జీటీ సంయుక్త కమిటీ పర్యటన