ETV Bharat / crime

Viveka murder case: సీబీఐ నార్కో పిటిషన్‌పై జమ్మలమడుగు కోర్టులో విచారణ

వైఎస్‌ వివేకా హత్యకేసులో సీబీఐ వేసిన నార్కో పిటిషన్‌పై కడప జిల్లా జమ్మలమడుగు కోర్టులో విచారణ జరుగుతోంది. జమ్మలమడుగు కోర్టు ఇప్పటికే రెండుసార్లు వాదనలు విన్నది.

Viveka murder case
Viveka murder case
author img

By

Published : Sep 1, 2021, 12:33 PM IST

Updated : Sep 1, 2021, 2:16 PM IST

వైఎస్‌ వివేకా హత్యకేసులో సునీల్ యాదవ్‌ రిమాండ్ పొడిగింపుపై జమ్మలమడుగు కోర్టు విచారణ జరిగింది. ఈ నెల 15 వరకు సునీల్ యాదవ్‌కు రిమాండ్ పొడిగించింది.

వైఎస్‌ వివేకా హత్యకేసులో సీబీఐ వేసిన నార్కో పిటిషన్‌పై కడప జిల్లా జమ్మలమడుగు కోర్టులో విచారణ జరుగుతోంది. సునీల్‌ యాదవ్‌కు నార్కో పరీక్షల కోసం అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్‌ వేసింది. సాయంత్రం వర్చువల్‌గా జమ్మలమడుగు మెజిస్ట్రేట్ వాదనలు విననున్నారు. ఇప్పటికే జమ్మలమడుగు కోర్టు రెండుసార్లు వాదనలు వింది. సీబీఐ పిటిషన్‌పై మరోసారి జమ్మలమడుగు కోర్టు విచారణ చేపట్టింది.

ఇది వరకే రివార్డు ప్రకటన..

వివేకా హత్య కేసులో కచ్చితమైన, నమ్మకమైన సమాచారం ఇచ్చిన వారికి 5 లక్షల రూపాయల బహుమానం ఇస్తామని ఇప్పటికే సీబీఐ ప్రకటించింది. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురయ్యారని.. హై కోర్టు ఆదేశాల మేరకు గతేడాది జులై 9న వివేకా హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీబీఐ ప్రకటనలో పేర్కొంది. సామాన్య ప్రజలు ఎవరైనా సమాచారం అందించవచ్చని.. అలాంటి వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ ప్రకటనలో తెలిపింది. వివేకా హత్యకు సంబంధించి.. తెలిసిన సమాచారం సీబీఐ అధికారులైన దీపక్ గౌర్, రాంసింగ్ లకు అందజేయాలని వారి ఫోన్ నంబర్లు, చిరునామాను ప్రకటనలో వెల్లడించింది.

ఇదీ చదవండి:

viveka murder case: ప్రొద్దుటూరు కోర్టుకు వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి

Last Updated : Sep 1, 2021, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.