ETV Bharat / crime

నెల్లూరులో వ్యాన్​ బోల్తా.. నలుగురికి గాయాలు.. సీసీ కెెమెరాలో దృశ్యాలు ​ - crime news in ap

VAN OVERTURNED : నెల్లూరులో వరుస విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఒక్కరోజే కుటుంబ కలహాల నేపథ్యంలో ఐదుగురు మృతి చెందగా, వినాయకచవితి ఉత్సవాల్లో మరో మహిళ మరణించింది. తాజాగా ముత్తుకూరులో వ్యాన్​ అదుపుతప్పి డివైడర్​ను ఢీకొన్న ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

VAN OVERTURNED
VAN OVERTURNED
author img

By

Published : Sep 1, 2022, 10:13 PM IST

ACCIDENT IN NELLORE : నెల్లూరులోని ముత్తుకూరు రోడ్డులో వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి.. డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలుకాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈపూరు వెంకన్నపాళెం వద్ద విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు.. వ్యాన్‌లో ఉదయం పాఠశాలకు వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం తునాతునకలైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ఉపాధ్యాయులతోపాటు, బైక్‌పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

నెల్లూరులో వ్యాన్​ బోల్తా.. నలుగురికి గాయాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.