పార్వతీపురం మన్యం జిల్లాలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాలకొండలో 'మనం' మోటర్ షోరూమ్‌లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. దీపావళి ధమాకా స్పెషల్ ఆఫర్‌తో బైక్ బ్యాటరీలు భారీగా షోరూంకు వచ్చాయి. అర్ధరాత్రి మంటలు చెలరేగి 36 ఎలక్ట్రిక్ స్కూటీలు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పేశారు. సుమారుగా రూ.50 లక్షలు ఆస్థి నష్టం ఉంటుందని షోరూమ్ యజమాని రమేష్ తెలిపారు.
ఇవీ చదవండి: