ETV Bharat / crime

అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ సెల్వరాజ్ ఆస్తుల జప్తు.. పలు కేసుల్లో ఈడీ దర్యాప్తు! - ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

Enforcement Directorate: శేషాచలం అడవుల నుంచి భారీ మొత్తంలో ఎర్రచందనాన్ని కొల్లగొట్టి విదేశాలకు తరలించిన అంతర్జాతీయ స్మగ్లర్ల్, చెన్నై వాసి ఆర్‌.సెల్వరాజ్‌ ఆస్తుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జప్తు చేసింది. మార్కెట్‌ విలువ రూ.7.54 కోట్లు ఉంటుందని ఈడీ వెల్లడించింది. అక్రమార్జన అంతా సక్రమంగా చూపించేందుకు నిధుల్ని సంజన మెటల్‌వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లోకి మళ్లించాడని ఈడీ దర్యాప్తులో తేలింది.

Enforcement Directorate
ఎర్రచందనం అంతర్జాతీయ స్మగ్లర్ సెల్వరాజ్ ఆస్తుల జప్తు
author img

By

Published : Mar 30, 2022, 11:25 AM IST

Enforcement Directorate: శేషాచలం అడవుల నుంచి భారీ మొత్తంలో ఎర్రచందనాన్ని కొల్లగొట్టి విదేశాలకు తరలించిన అంతర్జాతీయ స్మగ్లర్లలో ఒకరైన చెన్నై వాసి ఆర్‌.సెల్వరాజ్‌ ఆస్తుల్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) జప్తు చేసింది. వీటి పుస్తక విలువ రూ.2.74 కోట్లు కాగా, మార్కెట్‌ విలువ రూ.7.54 కోట్లు ఉంటుందని ఈడీ వెల్లడించింది. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద చెన్నై రెడ్‌హిల్స్‌ ప్రాంతంలో ఉన్న 8 నివాస స్థలాలు, శ్రీపెరంబదూర్‌ సమీపంలోని వల్లకొట్టాయ్‌ గ్రామంలోని ఆరు వ్యవసాయ క్షేత్రాలు, చెన్నై, పాండిచ్చేరిలోని రెండు విలాసవంతమైన నివాసాల్ని ఈడీ జప్తు చేసింది.

సెల్వరాజ్‌కు చెందిన సంజన మెటల్‌వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు సంబంధించి రూ.2.07 కోట్ల విలువైన చరాస్తుల్ని స్వాధీనం చేసుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌ ద్వారా వచ్చిన డబ్బుతో సెల్వరాజ్‌ పెద్ద ఎత్తున స్థిరాస్తులు కొని, కంపెనీల్లో పెట్టుబడి పెట్టాడు. అక్రమార్జన అంతా సక్రమంగా చూపించేందుకు నిధుల్ని సంజన మెటల్‌వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌లోకి మళ్లించాడని ఈడీ దర్యాప్తులో తేలింది. అతనిపై రాష్ట్రంలో చిత్తూరు, తిరుపతి అర్బన్, కడప, కర్నూలు తదితర చోట్ల 20కి పైగా కేసులున్నాయి. చెన్నైలోని కమిషనరేట్‌ ఆఫ్‌ కస్టమ్స్‌లో సైతం అతనిపై కేసులున్నాయి. సెల్వరాజ్​పై నమోదైన కేసులకు సంబంధించి చిత్తూరు న్యాయస్థానంలో ఏపీ పోలీసులు అభియోగపత్రం దాఖలు చేశారు.

ఇదీ చదవండి: Children Rally: నరసాపురం జిల్లా కేంద్రం కోసం చిన్నారుల ర్యాలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.