ED on Servomax MD Case: సర్వోమాక్స్ ఎండీ అవసరాల వెంకటేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వెంకటేశ్వరరావును 4 రోజుల కస్టడీలోకి తీసుకున్న అధికారులు.. ఈడీ కార్యాలయానికి తరలించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను డొల్ల కంపెనీలకు మళ్లించిన కేసులో అధికారులు ప్రశ్నిస్తున్నారు. పలు బ్యాంకుల నుంచి రూ.402 కోట్ల వరకు రుణం తీసుకున్న వెంకటేశ్వరరావు.. సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఈడీ అధికారులు ప్రాథమికంగా తేల్చారు. బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి పలు కోనుగోళ్లు చేసినట్లు, లావాదేవీలు నిర్వహించినట్లు నకిలీ పత్రాలు సృష్టించారని తెలిపారు.
బ్యాంకుల ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా నిధుల మళ్లింపు కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు.. సర్వోమాక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు వెంకటేశ్వరరావు, ఆయన బినామీలకు చెందిన బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. ఈ కేసులో వెంకటేశ్వరరావును ప్రశ్నించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: MURDER: ముద్దాడపేటలో దారుణం... భార్య, సోదరిని చంపి వ్యక్తి ఆత్మహత్యాయత్నం