ETV Bharat / crime

న్యూడ్‌ వీడియోతో మహిళను వేధిస్తున్న ఇద్దరు అరెస్టు - దిశ పోలీసులు

Woman Harassment With Nude Video అవసరాల కోసం అప్పు తీసుకున్న మహిళను ఆసరాగా చేసుకుని వేధింపులకు గురి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను దిశ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.

Woman Harassments With Nude Video Woman Harassments With Nude Video
Woman Harassments With Nude Video
author img

By

Published : Aug 18, 2022, 10:51 PM IST

Two People Arrest In Harassment Case నగ్న వీడియోతో మహిళను వేధిస్తున్న ఇద్దరిని.. కృష్ణా జిల్లా మచిలీపట్నం దిశ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమండ్రికి చెందిన ఓ మహిళ.. తన అవసరాల కోసం.. హన్సకుమార్ అనే వ్యక్తిని అప్పు అడిగింది. దీనిని ఆసరాగా తీసుకున్న ఆ వ్యాపారి.. మహిళను నమ్మించి నగ్న వీడియో తీసి.. వేధింపులకు పాల్పడుతున్నాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వీడియోను మరొకరికి షేర్‌ చేసి.. ఇద్దరు కలిసి వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

న్యూడ్‌ వీడియోతో మహిళను వేధిస్తున్న ఇద్దరు అరెస్టు

అసలేం జరిగింది: రాజమహేంద్రవరానికి చెందిన ఓ వివాహిత.. భర్తతో విడిపోయి పిల్లలతో వేరుగా ఉంటోంది. బతుకుతెరువు కోసం దుకాణం నడుపుకుంటోంది. వ్యాపార అవసరాల కోసం రాజమహేంద్రవరానికి చెందిన హన్సకుమార్‌ జైన్‌ అనే వడ్డీ వ్యాపారి నుంచి అప్పు తీసుకునేది. ఇటీవల ఆమె అప్పు అడగ్గా ఎక్కువ వడ్డీ అవుతుందని, ఇష్టమైతేనే తీసుకోవాలని సమాధానమిచ్చాడు. లేనిపక్షంలో నగ్నంగా తనకు వీడియోకాల్‌ చేయాలని, గెస్ట్‌హౌస్‌కు రావాలని ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. గత్యంతరం లేక ఆమె నగ్నంగా వీడియో కాల్‌ చేసింది.

దీనిని హన్సకుమార్‌ స్క్రీన్‌ రికార్డర్‌ సాయంతో తన సెల్‌లో రికార్డ్‌ చేశాడు. దీన్ని విజయవాడ కానూరులో ఉంటున్న అతని బంధువు చందు చూసి.. తన ఫోన్‌, ల్యాప్‌టాప్‌లోకి కాపీ చేసుకున్నాడు. వీటిని పోర్న్‌ సైట్లలోకి అప్‌లోడ్‌ చేసి, వాటి లింక్‌ను బంధువులకు పంపిస్తానని చందు ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. వీడియో తాలూకూ స్క్రీన్‌ షాట్‌ను తీసి బాధితురాలితోపాటు తన వ్యాపార భాగస్వామికి కూడా పంపాడు. వేధింపులు ఎక్కువవడంతో ఆమె మచిలీపట్నంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు దీనిని మహిళా పోలీసుస్టేషనుకు బదిలీ చేశారు. కానూరుకు చెందిన చందు, రాజమండ్రికి చెందిన వడ్డీ వ్యాపారి హన్సకుమార్‌ జైన్‌ను అరెస్టు చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.