Dead body found in Gorantla canal: గుంటూరు జిల్లా నరసరావుపేటలోని గోరంట్ల మేజర్ కాల్వలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యమైంది. నకరికల్లు మండలం చల్లగుండ్ల వద్ద గల గోరంట్ల మేజర్ కాల్వలో.. కుంకలగుంటకు చెందిన ఇద్దరు వ్యక్తులు బుధవారం రోజు గల్లంతయ్యారు.
వారికోసం రాత్రంతా స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా.. గల్లంతైన వారిలో వర్ల శ్రీనివాసరావు మృతదేహం లభ్యమైంది. ఏడుకొండలు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: మామతో వివాహేతర సంబంధం.. ఏకాంతంగా ఉన్నప్పుడు కుమార్తె చూసిందని..