ETV Bharat / crime

Mahesh Bank case Updates: సాఫ్ట్​వేర్​లోని లోపాలే మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాకింగ్​కు కారణం..

Mahesh Bank Server hack case Updates: మహేశ్ బ్యాంకు హ్యాకింగ్ కేసులో తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు... ఖాతాదారుల వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. రూ.12కోట్లను 300కి పైగా ఖాతాల్లో బదిలీ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అపెక్స్ బ్యాంక్ సర్వర్, మహేశ్ బ్యాంక్ సర్వర్​కు ఒకే సంస్థ సాఫ్ట్​వేర్​ను సమకూర్చినట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. సాఫ్ట్​వేర్​లోని లోపాలను గుర్తించిన సైబర్ నేరగాళ్లు... సర్వర్లను హ్యాక్ చేశారని ప్రాథమికంగా తేల్చారు.

Mahesh Bank case Updates
Mahesh Bank case Updates
author img

By

Published : Jan 28, 2022, 7:59 PM IST

Mahesh Bank Server hack case Updates : మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాకింగ్ కేసులో పరారీలో ఉన్న మహిళ కోసం తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు గాలిస్తున్నారు. షానవాజ్ బేగం అనే పేరుతో ఉన్న ఖాతాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ఈ ఖాతాలో రూ.6.9కోట్లు బదిలీ చేసి ఆ తర్వాత వివిధ ఖాతాల్లోకి మళ్లించారు. వినోద్, నవీన్ అనే మరో ఇద్దరి ఖాతాదారుల ఖాతాల్లోనూ సైబర్ నేరగాళ్లు రూ.5కోట్ల వరకు జమ చేశారు. ఇద్దరి ఖాతాదారుల ఓటీపీ మార్చేసి.. వారి ఖాతాల్లో ఉన్న నగదును ఇతర ఖాతాల్లోకి మళ్లించారు. ఇద్దరినీ ప్రశ్నించిన సైబర్ క్రైం పోలీసులు... సైబర్ నేరగాళ్లతో ఎలాంటి సంబంధం లేదని ప్రాథమికంగా తేల్చారు.

ఎవరీ షానవాజ్..?

Mahesh Bank case : షానవాజ్ ఖాతాను పరిశీలించిన పోలీసులు... ఆమె మొబైల్ నంబర్, ఓటీపీ మారకపోవడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఖాతాలో రూ.6.9కోట్లు జమ అవడంతో బ్యాంకు సిబ్బంది వెంటనే గుర్తించి ఫోన్ చేశారు. వెంటనే స్విచ్ఛాప్ చేసిన షానవాజ్ బేగం... ఆచూకీ లేకుండా పోయింది. పరారీలో ఉన్న ఆమెను పట్టుకుంటే హ్యాకింగ్​కు సంబంధించిన విషయాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. షానవాజ్ వినియోగిస్తున్న ఫోన్​ను విశ్లేషించిన అధికారులు... ఆమె కొన్ని నెలల క్రితం ముంబయిలో ఉన్నట్లు గుర్తించారు. ఆమె ముంబయి నుంచి వచ్చి నకిలీ ధ్రవపత్రాలు సమర్పించి... మహేశ్ బ్యాంకులో ఖాతా తెరిచిందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ముగ్గురి ఖాతాలకు రూ.12కోట్లకు పైగా బదిలీ చేసిన సైబర్ నేరగాళ్లు అక్కడి నుంచి... ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లోని 20 బ్యాంకులకు చెందిన 128ఖాతాలకు బదిలీ చేశారు. 128 ఖాతాల నుంచి మరో 200కు పైగా ఖాతాలకు నగదు బదిలీ చేసి అక్కడి నుంచి విత్ డ్రా చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

సర్వర్ లోపాలే కారణమా?

Mahesh bank hacking case : సర్వర్ నిర్వహణ లోపాలే హ్యాంకింగ్​కు దారి తీశాయని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఆరు నెలల క్రితం అపెక్స్ బ్యాంకు సర్వర్ హ్యాక్ అయిన విధానం... ప్రస్తుతం మహేశ్ బ్యాంకు సర్వర్ హ్యాక్ విధానం ఒకే విధంగా ఉండటాన్ని పోలీసులు విశ్లేషిస్తున్నారు. రెండు బ్యాంకులకు కూడా ఒకే సంస్థ సర్వర్ల రక్షణకు సంబంధించిన సాఫ్ట్ వేర్​ను ఏర్పాటు చేసినట్లు సైబర్ క్రైం పోలీసుల దర్యాప్తులో తేలింది. సర్వర్లు హ్యాక్ కాకుండా కావాల్సిన ఫైర్ వాల్స్, ఇతర రక్షణ చర్యలను సాఫ్ట్ వేర్ సంస్థ చూస్తోంది. అపెక్స్ బ్యాంకు సర్వర్ హ్యాక్ అయినప్పుడే.... సాఫ్ట్ వేర్​లో ఏమైనా లోపాలున్నాయా అని సదరు సంస్థకు చెందిన నిర్వాహకులు సమీక్షించుకుని ఉంటే... మరోసారి హ్యాకింగ్ జరిగి ఉండేది కాదేమోనని సైబర్ క్రైం పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

అప్రమత్తం కాలేదా?

cyber crime : అపెక్స్ బ్యాంకు సర్వర్ హ్యాక్ అయిన విషయం కూడా ... మహేశ్ బ్యాంకు ఐటీ సిబ్బందికి తెలియదని సైబర్ క్రైం పోలీసులు చెప్పారు. అపెక్స్ బ్యాంకు హ్యాక్ అయిన వెంటనే వాళ్లకు సాఫ్ట్ వేర్ సమకూర్చిన సాఫ్ట్ వేర్ సంస్థ... వాళ్ల క్లైంటు అయిన మహేశ్ బ్యాంకును అప్రమత్తం చేసి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. సైబర్ నేరగాళ్లు సర్వర్ ను శనివారం హ్యాక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మహేశ్ బ్యాంకు ప్రధాన శాఖ నుంచి గరిష్ఠంగా బదిలీ చేసే నగదు రూ.5 కోట్ల వరకే పరిమితి ఉంది. సైబర్ నేరగాళ్లు దీన్ని రూ.50కోట్ల వరకు పెంచినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే సైబర్ నేరగాళ్లు శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం లోపు రూ.12.4కోట్లను బదిలీ చేశారు. ఈ లోపే మహేశ్ బ్యాంకు సిబ్బంది బ్యాంకు స్టేట్ మెంట్​లో రూ.12కోట్ల తేడాను గుర్తించారు. ఒకవేళ మహేశ్ బ్యాంకు సిబ్బంది గుర్తించకపోయి ఉంటే మరో రూ.20 కోట్ల వరకు సైబర్ నేరగాళ్లు బదిలీ చేసి ఉండే వారేమోననే అనుమానాన్ని సైబర్ క్రైం పోలీసులు వ్యక్తం చేశారు.

షానవాజ్​తోనే మరింత సమాచారం..

cyber crime police investigation on bank case : అపెక్స్ బ్యాంకు ఘటనలో ఇద్దరు ఖాతాదారులు... సైబర్ నేరగాడికి సహకరించడంతో పాటు వాళ్ల ఖాతాలో పడిన డబ్బులో 10శాతం కమిషన్ తీసుకొని... మిగతా మొత్తాన్ని చెల్లించారు. ఖాతాదారులను అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు... సైబర్ నేరగాడిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. కానీ అతనికి సంబంధించిన ఇతర ఆధారాలేమీ లభించకపోవడంతో కేసులో పురోగతి లేదు. మహేశ్ బ్యాంకుకు చెందిన ఖాతాదారు షానవాజ్ బేగంను ప్రశ్నిస్తే హ్యాకింగ్​కు సంబంధించి కొంత సమాచారం వచ్చే అవకాశం ఉందని సైబర్ క్రైం పోలీసులు భావిస్తున్నారు.

ఈనాన్య రాష్ట్రాలకు సైబర్ క్రైం పోలీసులు..

hyderabad cyber crime police : రెండు రోజుల్లో కలకత్తా వెళ్లి... ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకులకు చెందిన ఖాతాలను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పరిశీలించనున్నారు. సైబర్ నేరగాళ్లు నగదు బదిలీ చేసిన ఖాతదారుల వివరాలను సేకరించనున్నారు. ఆ ఖాతాదారులకు, సైబర్ నేరగాళ్లకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే వివరాలను తెలుసకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: 28 మంది ఎంపీలు ఉండి 32 నెలల్లో ఏం చేశారు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.