ETV Bharat / crime

దేశవ్యాప్తంగా రూ.903 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారు: సీవీ ఆనంద్‌ - Hyderabad CP CV Anand Latest News

Chinese gang arrested for cheating in investments: దేశ ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించే రీతిలో మోసాలు జరుగుతున్నాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. పెట్టుబడులు పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముఠాలోని కీలక నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. మనీ ఎక్స్ఛేంజీల ద్వారా భారత కరెన్సీని డాలర్లుగా మార్చినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇలా దేశవ్యాప్తంగా రూ.903 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారని సీవీ ఆనంద్ వెల్లడించారు.

cv anand
cv anand
author img

By

Published : Oct 12, 2022, 7:15 PM IST

Chinese gang arrested for cheating in investments: వివిధ రకాల పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తూ దేశ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలను కాజేసిన నేరగాళ్ల గుట్టును హైదరాబాద్ సైబర్​ క్రైం పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఇద్దరు చైనీయులు సహా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలియజేశారు.

నిందితులు రూ.903 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు గుర్తించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మనీ ఎక్స్ఛేంజీల ద్వారా భారత కరెన్సీని డాలర్లుగా మార్చారని చెప్పారు. డాలర్లుగా మార్చి ఇతర దేశాలకు హవాలా మార్గంలో తరలించారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రూ.903 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారని వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు కలిగించే మోసంగా సీవీ ఆనంద్‌ తెలిపారు.

ప్రధాన నిందితుడు చైనాకు చెందిన చు చున్ యూగా గుర్తించామని సీవీ ఆనంద్ తెలిపారు. ఆర్బీఐ అనుమతి పొందిన నగదు ఎక్స్ఛేంజీల ద్వారా లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించామని తెలియజేశారు.పెట్టుబడుల పేరుతో వచ్చిన యాప్‌లో తార్నాక వాసి పెట్టుబడి పెట్టారని తెలిపారు. లాక్సమ్ యాప్‌లో రూ.1.6 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయారని సీవీ ఆనంద్ చెప్పారు.

క్సిండై టెక్నాలజీకి చెందిన వీరేందర్ ఖాతాలో నగదు జమ అయినట్లు గుర్తించామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. చైనా వాసి జాక్‌ ఆదేశాల మేరకు ఖాతా తెరిచినట్లు వీరేందర్‌ చెప్పాడని తెలిపారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్ వివరాలు జాక్‌కు వీరేందర్ ఇచ్చాడని సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

దేశవ్యాప్తంగా రూ.903 కోట్ల మేర మోసాలకు పాల్పడ్డారు: సీవీ ఆనంద్‌

"కంబోడియాలో కేంద్రం ఏర్పాటు చేసుకొని చైనా వాళ్లు పనిచేస్తున్నారు. ఈ డబ్బు చైనాకు వెలుతుంది. రూ.900 కోట్ల మోసానికి పాల్పడ్డారు. వర్చువల్ అకౌంట్లు, ఫేక్ అకౌంట్లను తెరుస్తారు. వర్చువల్ అకౌంట్లు ఏటంటే బ్యాంకింగ్ మించి పనిచేస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు కలిగించే విధంగా ఈకేసు ఉంది." - సీవీ ఆనంద్ హైదరాబాద్ సీపీ

అసలేెం జరిగిందంటే: వివిధ రకాల పెట్టుబడుల పేరుతో ప్రజలను మోసం చేస్తూ దేశ వ్యాప్తంగా సైబర్ క్రైం పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కీలక నిందితులను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్​లో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు... దిల్లీలో నేరస్తులు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీతో పాటు పలు రకాల పెట్టుబడులు పేరుతో సెల్​ఫోన్​లకు సందేశాలు పంపుతున్న నిందితులు స్పందించిన వారికి యాప్ డౌన్​లోడ్ చేయిస్తున్నారు.

అధిక లాభాలు వస్తాయంటూ పెట్టుబడి పెట్టిస్తున్నారు. వచ్చిన లాభాలను నేరగాళ్లు వ్యాలెట్​లో చూపిస్తున్నారు. నమ్మిన తర్వాత ప్రజలు అధిక మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. అనంతరం యాప్ ను డిలీట్ చేస్తున్నారు. ఇలా అధిక లాభాల కోసం పెట్టుబడి పెట్టి వారిని సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారు. ఈ సొమ్మంతా చైనాకు వెళతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.