కొవిడ్ పాజిటివ్ వచ్చిందని ఓ మహిళ (55) ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలురకు చెందిన మహిళకు రెండు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. తనకు ఎమవుతుందోనని ఆందోళనతో బలవన్మరణానికి పాల్పడింది.
మంగళవారం తెల్లవారుజామున గ్రామంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కరోనా బాధితులు మానసికంగా ఆందోళన చెందొద్దని అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నప్పటికీ పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చికిత్స ఉందని తెలిసినా విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి: 'ఈటీవీ బాలభారత్' ఛానళ్లను ప్రారంభించిన రామోజీరావు