Clash: బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం ప్రజ్ఞం గ్రామంలో జరిగిన తిరునాళ్లలో కొందరు యువకుల తీరు ఘర్షణకు దారితీసింది. ప్రజ్ఞమ్మ గ్రామ దేవత తిరునాళ్లలో కొందరు ఆకతాయిలు.. అతి వేగంగా ద్విచక్రవాహనాలను నడుపుతుండగా.. స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. కర్రలు, చెక్కలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడి తలపై తీవ్ర గాయాలయ్యాయి. బాధిత యువకుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. వారిని చెల్లాచెదురు చేశారు.
ఇదీ చదవండి: MP RAGHURAMA: 'కశ్మీర్ ఫైల్స్‌లా "కాకాణి ఫైల్స్" సినిమా తీయవచ్చు'